‘ముఖీలు’తో ముఖాముఖి

ముఖీలు – నామౌచిత్యం
కవిత్వం సామాజిక చైతన్య స్వరూపం. కవితా స్వరూపం బహుముఖీనం. ఆధునిక కవితా స్వరూపంలో పన్నో వినూత్న ప్రక్రియలు విరాజిల్లాయి. ముఖపుస్తకం ద్వారా పంచబడ్డ మినీ కవితలను ‘ముఖీలు’ గా నామకరణం చేసి తెలుగు సాహిత్యానికి మరో ప్రక్రియను పరిచయం చేశారు ఆచార్య పన్‌. ఈశ్వరరెడ్డి. సాహిత్యం రచయితను రసవంతం చేసే కవిత్వం కవిని ప్రగతిబాటలోకి తెచ్చిన వైనం ‘నాలోనువ్వు’లోని మినీ కవితలో సాక్షాత్కరించింది.
ఏ తరంలోని సాహిత్యమైనా తన కాలపు ఆలోచనా స్వభావాలను ప్రతిబింబిస్తుంది. ఒక యుగం వెనకటి యుగపు సాహిత్య ప్రమాణాలను గుడ్డిగా అనుసరించదు. అది వర్తమాన కాలం నుండి ఆవేశాన్ని పొందుతుంది. అలానే నవీన సమాజంలో నిరంతరం జరుగుతున్న అనేక పరిణామాలు, పరిస్థితులు, సంఘటనలకు ప్రతిస్పందిస్తూ సమాజానికి పక్కుపెట్టిన అక్షరాస్త్రాలే ‘ముఖీలు’!. ‘నాలో నువ్వు’ అంటే ఇదేదో ప్రణయ కావ్యం అనుకోవచ్చు. కాని ప్రపంచాన్ని తనతో సమన్వయించుకొని స్పందించిన అక్షరాస్త్రాలే ఈ ‘ముఖీలు’.
సామాజిక స్పృహ – మనోధర్మ ప్రేరణ
సమాజం పట్ల అభిమానం, మానవీయతా విలువలు కల్గిన కవి మనోధర్మప్రేరణగా బాధ్యత వహించి తనంతట తానుగా సామాజిక పరివర్తినకు దోహదం కల్గిస్తాడు. సమాజ పరిణామక్రమంలో మార్పును ఆకాంక్షిస్తాడు. సమాజ స్థితిగతులను పూర్తిగా అవగాహన కల్గిన కవి కాబట్టి రాజకీయాలు, విద్య, ప్రాంతీయ అస్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, మతం, చైతన్య ప్రబోధం మొదలగు అంశాలపై వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన సత్యాలు ‘ముఖీలు’లో ప్రతిధ్వనిస్తున్నాయి.
మనిషిలోనే రెండు పరస్పర విరుద్ధ కోణాలుంటాయంటారు. ఆ రెండు కోణాల మధ్య సమన్వయం సాధిస్తుంది ఆలోచన. ఆ రెండు ప్రపంచాల మధ్య వారధి కడుతుంది కవిత్వం. అది ఏ ప్రయోజనాలను కాపాడుతుందనేది పాఠకుడు నిర్ణయించుకుంటాడు. సమాజపరిణామ క్రమమే పర్యవసానంగా, సామాజిక శ్రేయస్సు పరమావధిగా కవి కలం కదిలించాడు.
సమాజం, సమాజానికో చరిత్ర, ఆ చరిత్రకో పరిణామక్రమం, ఆ పరిణామక్రమాన్ని వేగవంతంగా నడిపించేవాడే కవి. సమకాలీన సమస్యలకు స్పందించి రాయాల్సిందే కవిత్వం. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన తీరు ఈశ్వరరెడ్డి కవిత్వంలో కనిపిస్తుంది.
దారిచూపే నయనం ` మేలుకోరే గమనం
ప్రశ్నించే తత్త్వం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ముక్కుసూటి తనంగా వ్యవహరించడం కవి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశమైతేÑ ఆ వ్యక్తిత్వమే ముఖీలలో ముఖ్యంగా సామాజిక బాధ్యతగా ప్రతిస్పందించిన తీరు కనిపిస్తుంది.
ప్రశ్న / ప్రగతికి
పునాది! / అవసరం
సృజనకు మాతృక’!
తప్పును ప్రశ్నించినపుడే సమాజానికి ప్రగతి సాధ్యమవుతుంది. మేధావి మౌనం ప్రగతికి అవరోధం అనే భావన ద్యోతకమవుతుంది. పవరో ఏదో చేస్తారని ప్రశ్నించడం మానేస్తే సమాజ అభ్యుదయానికి అవరోధం ఏర్పడుతుంది అనే కోణంలో కవి కలం కదిలింది. నిత్యం చెమటపూలతో అవనిని ఆరాధిస్తున్న కర్షక, కార్మికులను నాగరికతా నిర్మాతలని వారే పుడమి రథచక్రాలని అభివర్ణిస్తాడు. ప్రపంచంలో గొప్పగా చదవాల్సిందేదైనా ఉంది అంటే ముందు నిన్ను నువ్వు చదువుకొని, తరువాత సమాజాన్ని అధ్యయనం చేయాలి అనే భావన కవి తలంపుగా కనిపిస్తుంది.
తనకు తెలిసిందే / సర్వం అనుకునే వాడు అజ్ఞాని
ప్రపంచాన్ని / తెలుసుకున్నవాడు విజ్ఞాని !
ప్రపంచమే తెలుసుకోగల, / స్థితికి చేరుకోగలిగిన వాడు
నిజమైన జ్ఞాని!
సమాజంలో మూడురకాల మనుషులు అజ్ఞాని, విజ్ఞాని, జ్ఞానులుగా దర్శనమిస్తారు. ఈ తరహా స్వభావం, వ్యక్తిత్వం సహజంగా తారస పడుతూనే ఉంటాయి. తనను తాను తెలుసుకొని ప్రపంచమే తెలుసుకో గలిగిన స్థాయికి చేరుకోవడమే నిజమైన జ్ఞాని లక్షణం అంటాడు.
‘గతం భవిష్యత్తుకు పునాది’ అంటారు. గత అనుభవాన్ని వర్తమానానికి అన్వయిస్తే భవిష్యత్తు పటిష్ఠంగా ఉంటుంది. ‘‘గతాన్ని విస్మరిస్తే వర్తమానం కుంటుతుంది! వర్తమానాన్ని తేలికగా చూస్తే భవిష్యత్తు మందగిస్తుంది!’’ అంటాడు. త్రికాలాలను, పునాది, గోడ, పై కప్పులనే పదాలతో ప్రతీకాత్మకంగా ప్రయోగించాడు. ఏ కాలానికే అదే ధర్మంగా ప్రవర్తిల్లుతుంది అనే సత్యాన్ని ఆవిష్కరించాడు. దారి చూపే నయనం, మేలుకోరే గమనం, రచయిత వ్యక్తిత్వం వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తుకు పటిష్ఠ పునాది పలా వేయాలో తెలిసిన వ్యక్తిగా సమాజప్రగతి నిరంతర కాంక్షగా కవిత్వసృజన చేశారు. సహకారమే మన వైఖరైతేÑ ఉపకారమే మన ఊపిరైతే పేద గొప్ప భేదం పోయి, నీది నాదనే వాదం వెళ్ళిపోయి ఉన్నత సమాజం ఆవిర్భవిస్తుందనే భావన గమ్యమానమవుతుంది.
మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు పదుర్కోకుండా మనిషికి గుర్తింపురాదు. ఏ జీవితం ఒక గెలుపుతో మొదలు కాదు. ఏ జీవితం ఒక ఓటమితో ఆగిపోదు. జీవితంలో కష్టసుఖాలు, గెలుపు ఓటములు సహజమైనవే.
చీకటి తెరలను / చీల్చుకొస్తేనే
సూర్యోదయం / సమస్యల సుడిగుండాన్ని
ఛేదిస్తేనే / జీవిత విజయం
కష్టసుఖాలు / జీవిత నాణానికి
బొమ్మ – బొరుసులు
ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా ఒక్క దీపం వెలుగును దాచలేదు కదా. చీకటిని ఛేదిస్తేనే ప్రతి జీవితంలో ఉషోదయపు కాంతులు వెల్లివిరుస్తాయి. సమస్యల సవాళ్ళు విసిరినా, సమస్యల సుడిగుండాన్ని అధిగమిస్తేనే విజయం వరిస్తుంది. కష్టసుఖాలు అన్నవి జీవితమనే నాణానికి బొమ్మబొరుసులు అంటాడు. గెలుపు అందరికీ దొరకదు కాని గెలిచే శక్తి అందరిలో ఉంటుంది. ప్రయత్నమే మొదటి విజయంగా భావించాలి.
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో పవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. ‘‘మాటల్లో నిజాయితీ, చేతల్లో నీతి, ఆర్తుల పట్ల జాలి ఉంటే నువ్వు భగవంతునితో సమానం’’ అంటాడు. ‘‘భయం, భయం బ్రతుకు భయం, అన్నా మనకీ లోకం పన్నిన పద్మవ్యూహం’’ అంటాడొక కవి. పద్మవ్యూహంలో వ్యూహంతో జీవించడమే జీవితం. సమకాలీన సమాజంలో ‘‘వెక్కిరింపులు, ఛీత్కారాలు, అవమానాలు, అణచివేతలు వెంటాడుతున్నాయా? భయపడకు, పదురించి చూడు సింహాసనం ఇచ్చి కూర్చోబెడతా యంటాడు.’’
కొత్తభావాలు, కొంగొత్త ఆలోచనలు, సరికొత్త అభివ్యక్తీకరణ ఉంటేనే ఆ కవిత్వం చిరంజీవిగా నిలుస్తుంది. పాజిటివ్‌ థింకింగ్‌తో పంతో మంది యువతకు తన కవితలతో ప్రేరణ నివ్వడం కూడా ఈ ముఖీలలో గమనించ వచ్చు. ప్రతీకల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే. పదగాలనే ఆరాటం ముందు ఆటంకాలు నిలవవు. ‘‘అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షం అందేనా / పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా / ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం’’ అంటాడొక సినీకవి. ‘‘పంత దూరపు ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం. పంత పెద్ద లక్ష్యం అయినా చిన్న ప్రయత్నంతోనే ఆరంభం’’ అంటాడు.
జీవనవికాసం ‘‘మౌనంగానే పదగమని మొక్క నీకు చెబుతుంది’’ అన్నది ప్రసిద్ధమైన పలుకు. మౌనంగానే పదిగినా చెట్టు పప్పుడూ ఒదిగి కూర్చోదు. విస్తరించడం దాని సహజగుణం అంటాడు. దీనిని అనేక కోణాల్లో అన్వయించుకోవచ్చు. జ్ఞానపరిధి, ఆలోచనా పరిధి, చైతన్యపరిధి, సేవాపరిధి దేనినైనా విస్తరించుకోవచ్చని చెట్టుని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతీకాత్మకతో సంభాషించాడు. ‘‘సంతోషాలు వస్తువుల్లో, దుఃఖాలు లేముల్లో ఉండవని మానసిక స్థితే సుఖదుఃఖాలకు పరమ ప్రమాణం’’ అంటాడు. ఏదైనా మన ఆలోచనా స్థితిని బట్టి జీవన విధానం కొనసాగుతుంది. ‘‘ఏమి తెలియని వాడు అంతా తెలుసంటాడు! కొంత తెలుసుకున్నవాడు నాక్కూడా తెలుసు అంటాడు. జ్ఞానం స్వభావం అంతే కదా!’’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. ఏ పనినైనా నిన్నటి కంటే నేడు నాణ్యతా ప్రమాణాలతో బాధ్యతాయుతంగా విధిని క్రమశిక్షణతో నిర్వర్తించడమే దేశభక్తి అని స్పష్టం చేశాడు. ‘‘ఏ చదువైనా జీవితాన్ని నిలబెట్టేదై ఉండాలి. పంత గొప్ప శాస్త్రమైనా సమాజానికి ఉపయోగపడేదై ఉంటేనే ప్రయోజనం కాని లేకపోతే వృథా’’ అంటాడు.
సమాజంలో అందరూ కృషి ఫలితాన్ని శ్రమ, అదృష్టాలతో బేరీజు వేస్తాం. శ్రమ నిచ్చెన లాంటిదిÑ అదృష్టం జారుడుబల్ల లాంటిది. ‘‘శ్రమను నమ్ముకుంటే పైకి, అదృష్టాన్ని నమ్ముకుంటే కిందికి’’ అంటాడు. ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’ నువ్వు పదిగేటందుకు సరిమార్గం అన్న భావన ప్రస్ఫుటమవుతుంది. మనిషి కాలంతో పాటు మారాలి. కాలాన్ని మించిన గురువు గైడ్‌ ఇంకెవరుంటారు. కాలం అన్నీ నేర్పుతుంది. నేర్పిస్తుంది. ‘‘మనిషి కాలంతో పాటు మారకపోతే కాలం చెల్లిన పురావస్తువులా మిగిలిపోతాడు’’ అంటాడు. అయితే కాలెండర్‌ మారినంత వేగంగా కాలం (విలువలు) మారదు. పేజీలు మారినంత సులభంగా బతుకులు మారవంటాడు. బతుకులు మారాలంటే కాలంతో పాటు మనమూ మారాలి. అప్పుడే బతుకులు మారతాయి అన్నది గ్రహించాలి.
విలువల నెలవు – విజ్ఞానకొలువు
‘‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకాని కొనుక్కో అన్నాడు’’ కందుకూరి. పుస్తకాలే జీవనరేఖలను మార్చే భాగ్యప్రదాతలు.
పుస్తకాన్ని పట్టుకుంటే / ప్రపంచాన్ని
దాటవచ్చు / పుస్తకం వదిలేస్తే
చీకటి సంద్రంలో / మునిగిపోవచ్చు
పుస్తకాలే విజ్ఞాన వారధులు. గ్రంథ విజ్ఞానం అలవరచుకున్న వారి జీవితాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. అక్షరం ఒక అసమాన ఆయుధం. వినయంతో స్వీకరిస్తే నీ పాదాక్రాంతం అంటాడు. అక్షరంతో ప్రయాణిస్తేనే జీవితం చరిత్ర అవుతుందంటాడు. ‘‘బాల్యం భవిష్యత్తుకు సింహద్వారం. పిల్లలు భవిష్యత్తుకు భరోసాలు, భావి సమాజ సారధులు’’ అంటాడు.
నిత్యం జరిగే రోడ్ల ప్రమాదాల గూర్చి రోడ్ల నాలుకలు రక్తదాహంతో పదురు చూస్తున్నాయంటాడు. మైకం వేగం రెండూ ప్రమాదమే నంటాడు. సమస్యను చెప్పడం, పరిష్కార మార్గాన్ని చెప్పడం రచయిత బాధ్యతగా స్వీకరించి ‘ముఖీలు’ రచించాడు. అతివృష్టి, అనావృష్టి సీమరైతును నలిపేస్తున్న రెండు ఇనుపచక్రాలుగా భావిస్తాడు. మార్కెట్టు, దళారీలను రైతును దగాచేసే రెండు రాక్షస వ్యవస్థలుగా భావిస్తాడు.
‘‘పల్లెతల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిది’’ అన్నాడొక కవి. పల్లె కరిగి పట్నం వైపు ప్రవహిస్తుందంటాడు. డబ్బు కాళ్ళ కింద మనుషులు బలైపోతూ పంటలో ఇంకించి ప్లాట్లు మొలుస్తున్న వైనాన్ని ఆక్షేపించాడు. కరోనా నేపథ్యంలో ‘‘ప్రజాస్వామ్య పద్మవ్యూహం లో చిక్కుబడ్డ వలసాభిమన్యుణ్ణి నేను’’ అంటాడు. బతకడానికి వలస వెళ్ళిన వాళ్లు కరోనా పద్మవ్యూహంలో చిక్కుకున్న వైనాన్ని ఏకరువు పెట్టాడు.
ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడే సమాజాన్ని వాస్తవిక కోణంలో చూసి ఆవేదనలను, ఆక్రందనలను వ్యక్తం చేసి వ్యవస్థ తీరు మారాలి అనే కోణంలో భావనలను అక్షరబద్ధం చేసి కవిత్వ సృజన చేస్తాం. ఈ కోవకు చెందినవాడు ఈశ్వరరెడ్డి.
కవి ప్రపంచాన్ని, సమాజాన్ని తనలో ఆవహించుకొని పన్నో కోణాల్లో సమస్యల సునామీలను ఆవిష్కరించి మరో ప్రపంచం కోసం పదురు చూస్తున్న, కవితా స్వరూపమే ‘నాలోనువ్వు’. ప్రతి కవితలో ప్రగతి పరిమళాలు వెదజల్లించి నవసమాజాన్ని ఆకాంక్షించిన అభ్యుదయ కవి ఈశ్వరరెడ్డి.

డా. పి. విజయ కుమార్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగుశాఖ,
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం,
ఫోన్‌ : 990 805 9234

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *