తెలుగులో నవ్యకవిత్వం : ఆవిర్భావం, వికాసం

నవభారత నిర్మాణానికి కృషిచేసిన మహనీయులు రాజారామమోహనరాయలు గారు. వీరు భారతదేశ పునరుద్ధరణకు కారణబద్ధులై రెండు రకాలుగా కృషిచేశారు. భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తికి, సంఘసంస్కరణోద్యమానికి కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునికంగా వస్తున్న మార్పులను భారతీయులు తెలుసుకోవడానికి అవసరమైన ఆంగ్లభాషను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి మూలపురుషుడు రాజారాంమోహనరాయ్‌లు. 1823లో నాటి బ్రిటీషు ప్రభుత్వం భారతదేశంలో విద్యావ్యాప్తి గురించి కమిటిని నియమిస్తే, ఆ కమిటీ సంస్కృత కాలేజీలు ప్రారంభించ డానికి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫారసుని వ్యతిరేకించి సంస్కృత కాలేజీలకు బదులు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టమని ఆనాటి బ్రిటీషు గవర్నర్‌ జనరల్‌ ‘ూశీతీస Aఎష్ట్రవతీర్‌’గారికి ఉత్తరం రాశారు. దాని ఫలితంగా భారతదేశంలో 1835లో ఆంగ్ల విద్య వ్యాప్తి జరిగింది. ఆంగ్ల మాధ్యమాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం మూలంగా భారతదేశంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకున్నాయి. భారతీయుల ఆలోచన విధానం మారిపోయింది. పాశ్చాత్య దేశాలలోని సాహిత్యాన్ని ఇతరాలైన గణితం, సైన్సు లాంటి పుస్తకాలు చదవడం వలన పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుకున్నారు.
రాజారామమోహన్‌రాయ్‌ సంఘ సంస్కరణ కృషి చేయడానికి, సంఘ దురాచారాలను నిర్మూలించడానికి బ్రహ్మసమాజాన్ని స్థాపిం చారు. సంఘ సంస్కరణోద్యమాలను, సమాజాన్ని పునర్నిర్మించడం కోసం ‘సంవాద కౌముది’ అనే పత్రికను నిర్వహించారు. బెంగాల్‌ ప్రాంతంలో రాజారామమోహన్‌రాయ్‌గారి బ్రహ్మ సమాజంతో పాటు దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజం కూడా సంఘ సంస్కరణోద్యమం కొరకు కృషిచేసినదే. వీరు చేస్తున్న సామాజిక కృషికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావితులైన వారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. మరియు రఘుపతి వేంకటరత్నం నాయుడుగార్లు.
ఆంధ్రప్రాంతంలో సంఘసంస్కరణోద్యమానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. వీరు సంఘ సంస్కరణోద్యమం, స్త్రీ విద్యావ్యాప్తి, సాహిత్య ప్రక్రియలు ప్రారంభించిన నవయుగ వైతాళికుడు యుగ పురుషుడు కందుకూరి. వీరికి చైతన్యం కలిగించింది మాత్రం రాజారామమోహన్‌రాయ్‌. ఇదే విషయాన్ని ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు ఇలా అంటారు. ‘‘చైతన్యానికి పరోక్షంగాను, ప్రత్యక్షంగానూ తోడ్పడే బ్రహ్మసమాజం ఆర్య సమాజం, రామకృష్ణమిషన్‌, దివ్యజ్ఞాన సమాజం మొదలైన సంస్థలు సాగించిన ఉద్యమాలు ఇవన్నీ ఆంధ్రుల ఆలోచనలను రూపొందించిన కాలం పంతులుగారి కాలం.’’ (పుట341: 2015). వీరేశలింగంపంతులుగారు మొదట సంఘసంస్కర్త తరువాత కావ్యకర్త. వితంతువులకు వివాహాలు జరిపించుటకు, స్త్రీ జనోద్ధరణ ఉద్యమానికి సాహిత్యం ఒక సాధనంగా భావించారు. పంతులుగారి సాహిత్యం ఆలోచించడానికి ఆవిర్భవించినట్లుగా ఉంటుంది. పంతులుగారు 1874లో వివేకవర్ధని అనే తెలుగు మాస పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా రెండు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పుకున్నారు. అవి భాషాభివృద్ధి మరియు దేశాభివృద్ధి. సరళమైన శైలిలో రచనలు చేయటం వలన భాషాభివృద్ధితోపాటు, దురాచారాలను నిర్మూలించి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడటం కనిపిస్తుంది. భారతదేశంలో ఆంగ్లవిద్యావ్యాప్తి ద్వారా భారతీయులలో నూతన వికాసం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆంగ్లంతోపాటు తమ తమ మాతృభాషలలోనూ భారతీయులు రచనలు చేయడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశమైన మద్రాసులో స్థాపించిన ఒక కళాశాలలో కాంబెల్‌, విలియంబ్రౌన్‌, సి.పి.బ్రౌన్‌ మొదలైనవారు తెలుగు నేర్చుకొని ఇంగ్లీషులో తెలుగు వ్యాకరణాన్ని రాశారు. దక్షిణ భారతదేశంలో ప్రజలకు మరింత జ్ఞానాభివృద్ధికి, వికాసానికి కృషిచేసిన ప్రముఖులు ఏనుగుల వీరాస్వామయ్య, వెంబాంకం రాఘవాచార్యులు మరియు శ్రీనివాస పిళ్ళైగార్లు కలిసి హిందూ లిటరరీ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించారు. మద్రాసు ప్రాంతంలో ఒక ఆంగ్ల కళాశాల ప్రారంభించాలని అడిగితే కళాశాలకు బదులుగా 1841లో మద్రాసు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 1875 నాటికి భారతీయులు చాలామంది ఆంగ్లభాషను చదవడం, ఆంగ్లసాహిత్యాన్ని చదివి అర్థంచేసుకోవడం జరిగింది. అదే సమయంలో భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌లు స్థాపించారు. ఆంగ్ల సాహిత్యాన్ని చదివి, ఆ సాహిత్యంలో ఉన్న నవ్యతను గుర్తించి తెలుగులో కూడా అటువంటి వస్తు నవ్యతను తీసుకువచ్చారు. అదే సమయంలో భారతీయులు ముఖ్యంగా విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు చదువుతూ వచ్చారు. మొదట్లో భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికొరకు కృషి అనేక విధాలుగా జరిగింది. తెలుగులో వెలువడిన మొదటి పత్రిక సత్యదూత. బళ్ళారి నుండి క్రైస్తవ మత వ్యాప్తికొరకు వ్యావహారిక భాషలో వెలువడుతుండేది. క్రైస్తవ మత ప్రచారం కొరకు బైబిల్‌ను త్వరితగతిగా ప్రజలలోకి తీసుకురావడానికి నిఘంటు నిర్మాణం కోసం కృషి చేశారు. ఆ పనిని మొదటిసారిగా కాంబెల్‌ గారికి బ్రిటీష్‌ ప్రభుత్వం అప్పచెప్పింది. 1852లో బ్రౌన్‌ దొర రెండు నిఘంటువులను ఆంగ్లం నుండి తెలుగు, తెలుగునుండి ఆంగ్లం ప్రచురించారు. అందుకే బ్రౌన్‌ దొరను ఆంధ్రభాషకు అమరసింహుని వంటివాడని శ్రీ కురుగంటి సీతారామయ్యగారి అభిప్రాయం. బ్రౌన్‌ దొర నిఘంటువులను అచ్చు వేయడమే కాకుండా ప్రాచీన సాహిత్య పుస్తకాలు కొన్నింటిని ముద్రించి వెలుగులోకి తెచ్చిన మహనీయుడు. ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణోద్యమం చేస్తూనే మరోవైపు బహుముఖ సాహితీ ప్రక్రియలు సృష్టించడంలోనూ వీరేశలింగం పంతులుగారే పితామహులు. వీరు 1874లో వివేకవర్ధని అనే పత్రికలో భాషాభివృద్ధికి సంఘ సంస్కరణోద్యమానికి కృషిచేశారు. వీరు కవితారంగం తప్ప అన్నీ సాహితీ ప్రక్రియలలో కొత్త ప్రయోగాలు చేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. అందుకే వారి గురించి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారు ఇలా అంటారు. ‘‘అయిదవ వాచకం మొదలుకొని ఆంధ్రకవుల చరిత్రము వరకు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి’’ అని అంటారు. (పుట132:1999) అలాగే కందుకూరి గారు తన గురించి తానే స్వయంగా ఇలా చెప్పుకున్నారు. ‘‘తెలుగులో వచన ప్రబంధమును నేనే వ్రాసితిని మొదటి చరిత్రమును నేనే రచించితిని. స్త్రీలకై మొదటి వచన పుస్తకము నేనే కావించితిని’’ అని అన్నారు. (పుట132:1999) ఆంధ్ర ప్రాంతంలో ఒకవైపు ఆంగ్ల విద్యావ్యాప్తి మరోవైపు సంఘ సంస్కరణోద్యమం బలంగా సమాజంలోకి వస్తున్న కాలంలో, అదే సమయంలో ఆంగ్ల విద్యా విధానం ద్వారా నవ్యకవిత్వం తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది కట్టమంచి రామలింగారెడ్డిగారి ముసలమ్మ మరణం అనే కావ్యం ద్వారా. కట్టమంచి రామలింగారెడ్డిగారి ముసలమ్మమరణం అనే కావ్యం నవ్యకవిత్వానికి తొలి ఉషాకిరణమని చెప్పవచ్చు. ఈ కావ్యం నవ్య కవిత్వపు నూతన ప్రయోగం. 1889లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో కావ్య రచన పోటీలలో బహుమతి పొందిన కావ్యమే ‘ముసలమ్మ మరణం’. తెలుగులో భావ కవిత్వం రాకముందే ఈ రచన వెలువడిరది. ఈ కావ్యం ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో భావ కవిత్వానికి మార్గదర్శకంగా కనిపిస్తుంది. ఎందుకోగాని ఈ కావ్యం మొదట్లో ఎవర్నీ ఆకర్షించలేదు. కాని, రాయప్రోలు వారి తృణకంకణం ప్రచురణ తరువాత చాలామందిని ఆకర్షించింది. ఈ కావ్యంలోని వస్తువు, కథ మరణాంతముగా నవ్యతను సాదించింది. ఈ రచన కాలంలో మరణాంతముగా కావ్యమును పూర్తిచేయుట చక్కని నవ్యకవిత్వ ప్రయోగంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో తిరుపతి వెంకటకవులు తమ కవిత్వం ద్వారా అష్టావధానం, శతావధానం, ఆశుకవిత్వం మొదలైన ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యక్షేత్రంలో సుసంపన్నమైన స్థానం సంపాదించుకున్నారు. వీరు కూడా తమ రచనల్లో కూడా నవ్య కవిత్వోద్యమానికి సంబంధించిన కొత్తపుంతలు తొక్కిన వారుగా చెప్పవచ్చు. నవ్య కవిత్వ మహోదయానికి మూలకారకులు గురజాడ, రాయప్రోలు గార్లు. 1909 రాయప్రోలుగారి లలిత, 1910లో గురజాడగారి ముత్యాల సరాలు వెలువడినై. వీటితోనే తెలుగులో నవ్యకవితాశకం ప్రారంభమైంది. ఆనాడు సాహిత్యాభివృద్ధికి కృషిచేసిన ఆనాటి తెలుగు పత్రికలు మంజువాణి, మనోరమ, సరస్వతి, కళావతి, కల్పలత పత్రికలు ముఖ్యమైనవి. నాటి ఆంధ్రభారతి పత్రికలో ఖండకావ్యాలు ఎక్కువగా వెలువడినయి. నవ్య కవిత్వం సామాన్య మానవుల పలుకుబడిలాగా ఉంటుంది. కవిత్వ పదప్రయోగాలు ప్రజలకు దగ్గరలో ఉంటాయి. సమాజంలో సామాజిక మార్పు రావాలంటే దానికి శక్తివంతమైన సాహిత్యం రావాలి. ఈ మార్పు ఆధునిక కాలంలో నవ్య సాహిత్యం నుండే మొదలైంది. వాస్తవానికి ప్రాచీన సాహిత్యకోణం ఒకలా, ఆధునిక సాహిత్యకోణం మరోలా ఉంటుంది. ఇదే విషయాన్ని ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు ఇలా అంటారు ‘‘ప్రాచీన సాహిత్యంలో సమాజం ప్రతిఫలించింది కానీ, వీరేశలింగం పంతులుగారి కాలంనుండి సమాజానికి సాహిత్యం ప్రతిస్పందించింది. సమాజాన్ని తన భుజాల మీదకు ఎత్తుకున్నది’’ (పుట343: 2005) పంతులుగారి సాహిత్యంలో సంఘం చైతన్యంతో పాటు, సంఘం కోసం రచిస్తున్న సంస్కరణోద్యమ స్పృహకూడా కనిపిస్తుంది. సామాన్య మానవుడు అభివృద్ధి చెందితేనే ధేశం అభివృద్ధి చెందుతుందని అందుకే సామాన్యులను ఆలోచింపచేసే సాహిత్యమే పంతులుగారి చివరి లక్ష్యంగా కనిపిస్తుంది.
ఆధునికంగా నవ్యకవిత్వానికి బీజం 1909లో పడిరది. నవ్య కవిత్వం ప్రధానంగా ఖండకావ్యం రూపంలో కనిపిస్తుంది. నవ్య కవిత్వానికి అనేక రకాలుగా, భిన్న కోణాలలో నిర్వచనాలు ఇచ్చారు. విశ్వనాథగారు ఇచ్చిన నిర్వచనం పరిశీలిస్తే ‘‘సృష్టిక్రమంలో సృష్ట్యాది నుండి కాల నిర్ణయంలో భిన్న రాజచరిత్ర నిర్ణయంలో, సంఘ ధర్మ నీతులలో ఆర్థిక, రాజకీయాల్లో సారస్వత పథాలలో ఒక విశిష్టమైన సంస్కారంతో గూడిన సిద్ధాంతాల మీద మన జాతి నడిచింది. ఇవ్వాళ అంగిలేయులు మన్ని ఆక్రమించడం చేత ఆ మహా సంస్కారం మీద అభిమానం పోయింది. పాశ్చాత్య దేశీయుల సంస్కారం మీద అభిమానం ప్రబలింది. ఏ తదాభిమాన పురస్కృతములైన భాషాతత్త్వం, చరిత్ర నిర్మాణం, సృష్ట్యాది కాల నిర్ణయం, సంఘ ధర్మాలు, విశ్వాసాలు, వీటిని యేయే గ్రంథం పరామిర్శిస్తుందో అదంతా నవ్య సాహిత్యం’’ (పుట164: 1999). పై నిర్వచనాన్ని పరిశీలిస్తే ఆధునిక తెలుగు సాహిత్యం పాశ్చాత్యుల విజ్ఞానానికి లోనైనదని, ఆ ప్రభావంతో వచ్చినదంతా నవ్య సాహిత్యమని చెప్పవచ్చు. నవ్య సాహిత్యాన్ని రాసిన ప్రముఖ కవులు రాయప్రోలు, గురజాడ, నాయని, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ, నండూరి, దువ్వూరి, తుమ్మల, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కొమర్రాజు లక్ష్మణరావు, పింగళి, కరుణశ్రీ మొ॥నవారు. నవ్య కవులందరిలోనూ సాహిత్యంలో కొత్త ప్రయోగమే కనిపిస్తుంది. నవ్య కవిత్వంలో ఖండకావ్యమే ముఖ్యమైనది. ఇది 20వ శతాబ్దిలో ప్రారంభమైన ప్రక్రియ. పాశ్చాత్య విజ్ఞాన ఫలితంగా సమాజంలోనూ, సాహిత్యంలోనూ వచ్చిన మార్పు. ఖండకావ్యానికి ఇంగ్లీషు కవిత్వమే హేతువుగా కనిపిస్తుంది. కట్టమంచివారి ముసలమ్మ మరణం సాంఘిక ఇతివృత్తంగల ఒక విషాద కావ్యం. దాని గురించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు ఇలా అంటారు. ‘‘లిరిక్కుతో ప్రేరణ చెంది ముసలమ్మ మరణం అనే పాస్టోరల్‌ ఎలిజీని కొంత వీరగాథా స్వభావంగల పేరంటాలి చరిత్రను తెలుగులో పద్యాలలో నిర్మించారు కట్టమంచివారు 1899లోనే’’ అని అన్నారు (పుట268: 2005). నవ్య కవిత్వంలో రాయప్రోలు రచనల్లో తెలుగు జాతి సాంస్కృతిక మూల్యాంకన పునరుద్ధరణం కనిపిస్తుంది. వీరి కావ్యాలలో నాయికా ప్రాధాన్యం ప్రధాన భూమికగా ఉంటుంది.
నవ్యకవిత్వంలో వర్ణనలకు చెందిన పాత్రలను పరిశీలిస్తే నాయకీ నాయకులకు సంబంధించినవిగా కనిపిస్తాయి. యెంకి పాటలు, వనకుమారి, లవణరాజుకల లాంటి సామాన్య జనుల జీవితాలతో చిత్రించినవే. నవ్య కవిత్వంలో నాయికా నాయకుల గుణం మాత్రమే ప్రధానం. జాషువాగారి గబ్బిలం కావ్యంలో బక్కచిక్కిన అస్పృశ్యుడులో గుణం మాత్రమే మనకు కనిపిస్తుంది. నవ్య కవుల రచనలలో కనిపించే వస్తువు గొల్లవాళ్ళు, అస్పృశ్యులు, కాపువాళ్ళు, పడవనడిపేవాళ్ళ జీవితాలు కనిపిస్తాయి. ఈ కవుల వర్ణనలు సహజ సిద్ధంగా ఉంటాయి. అంగాంగ వర్ణనలు కనిపించవు. అనుభూతితో కూడిన వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. నవ్య కవిత్వంలో వస్తుపరంగా భావానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శైలీలోనూ నవ్యత ఉంటుంది. సరళపద ప్రయోగాలు ప్రజలందరికి, అర్థమయ్యే విధంగా రచనలు చేశారు. ఈ కవులు పదప్రయోగంలోనూ, వ్యవహారంలోనూ లేని పదాలను వాడలేదు. ప్రాచీనులు వాడిన విధంగా పదాలు స్వీకరించ లేదు. సమకాలీన కాలపు సమాజంలో ఉన్న పదాలు, చలామణిలో ఉన్న పదాలు ఎక్కువగా తీసుకున్నారు. శిష్టవ్యావహారిక భాషాపదాలు మాండలిక భాషాపదాలు, వాడుక భాషలో ఉన్న యాస పదాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నవ్య కవులు కవిత్వ గుణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. నవ్య కవిత్వంలో ప్రక్రియాపరంగా బహుముఖీకరణ కనిపిస్తుంది. నవ్యకవులు దేశీ కవితకు ప్రాధాన్యత ఇచ్చారు.
నవ్యకవిత్వంలో గురజాడ వారు చేసిన ప్రయోగాలు ప్రాచీన సాహిత్యంలో పాల్కురికి సోమనాథుని ప్రయోగాలు ఒకేలా కనిపిస్తాయి. ఇరువురు తమ తమ కాలాలలో వ్యవహారంలో ఉన్న పదాలు, పలుకుబడులు తమ రచనలలో ప్రయోగించిన వారే. పాల్కురికి జానుతెనుగును ప్రవేశపెడితే గురజాడ తెలుగు పలుకుబడికి పట్టం కట్టాడు. ఇద్దరిలోనూ దేశి పద్ధతి కనిపిస్తుంది. గురజాడ కావ్యవస్తువు ఎంచుకునే విషయంలో గురజాడపై వర్డ్సువర్తు, రవీంద్రుని ప్రభావం కనిపిస్తుంది. వర్డ్సువర్తు తన రచనలలో సామాన్య ప్రజల జీవితాలను కావ్యవస్తువుగా తీసుకున్నారు. గురజాడ వారు కూడా తన రచనలలో సామాన్య మానవుల జీవితాలనే కావ్యవస్తువుగా తీసుకున్నారు. వర్డ్సువర్త్‌ గొల్లవారి కథను తీసుకుంటే గురజాడ సెట్టికూతురును, పూజారికూతురును, లవణరాజుకలలో మాలెతను కావ్యవస్తువులుగా స్వీకరించారు. అలాగే రవీంద్రుని, గురజాడ రచనలలో విశ్వమానవప్రేమ కనిపిస్తుంది.
చిలుకూరి వీరభద్రరావు, అత్తిలి సూర్యనారాయణగార్లు రాయప్రోలు వారి ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించారు. రాయప్రోలు గారు గోల్డ్‌స్మిత్‌ రాసిన నవతీఎఱ్‌ అనే దానిని తెలుగులో లలిత అనే పేరుతో రచించారు రాయప్రోలుగారు. ఇది ఒక వియోగిని విలాప కావ్యం. టెన్నిసన్‌ రచించిన డేరా అనే కావ్యంను 1910లో అనుమతి అనే పేరుతో, 1912లో తృణకంకణంను రాయప్రోలు రచించారు. రాయప్రోలు రచనలలో వస్తు పరంగానూ, భావపరం గానూ, నవ్యత రూపంలో రాయబడిన కావ్యం తృణకంకణం. తృణకంకణం కావ్యంలో అమలిన శృంగార సిద్ధాంతం కనిపిస్తుంది. రాయప్రోలుపై వర్డ్సువర్త్‌, కీట్సు, షెల్లీలు, రవీంద్రుడు, కొమర్రాజు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కాళిదాసు, భవభూతిల ప్రభావం కనిపిస్తుంది. రాయప్రోలు రచనలలో మధ్యతరగతి వ్యక్తుల జీవితాలు, ప్రణయం ప్రధాన వస్తువులు. అలాగే వ్యక్తుల ప్రశంసాగీతాలకు, స్మృతిగీతాల రచనకు రాయప్రోలువారే మార్గదర్శకులు. ఇదే విషయాన్ని ఆచార్య నారాయణరెడ్డిగారు ఇలా అంటారు. వ్యక్తుల ప్రశంసా గీతములకు, స్మృతిగీతములకు (జుశ్రీవస్త్రవ) వీరే మార్గదర్శకులు. గోఖలే నిర్యాణం పిమ్మట వీరు వ్రాసిన పద్యము లానాటి సమాజమును కదిలించివేసినవి. అట్లే రాధాకృష్ణుడు, రవీంద్రుడు, రామలింగారెడ్డి, గిడుగు మున్నగు వారిని గూర్చి వీరు వ్రాసిన ప్రశంసాపద్యములు, స్మృతిగీతములు వీరి వస్తు నవ్యతకు తార్కాణాలు. వీరి వస్తువైవిధ్యము నకు పులియాకుపై వ్రాసిన పద్యములు మచ్చుతునకలు (పుట`286, 1999). గురజాడ రాయప్రోలు గార్ల రచనలను పరిశీలిస్తే గురజాడ వారు, సంఘ సంస్కరణ చైతన్యానికి ప్రాధాన్యమిస్తే, రాయప్రోలు వారు సాంస్కృతిక చైతన్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఆధార గ్రంథాలు
1) డా॥ సి. నారాయణరెడ్డి, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు: ప్రయోగములు, 1999.
2) ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, 2005
3) డా॥ కడియాల రామమోహనరాయ్‌, 20వ శతాబ్ది తెలుగు కవిత్వం, 2003.
4) డా॥ పోతిరెడ్డి చెన్నకేశవులు, స్వాతంత్య్రానంతర తెలుగు కవిత్వంలో సంఘసంస్కరణ, 2006.

డా. భూక్య తిరుపతి
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగుశాఖ,
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం,
ఫోన్‌ : 9010501030

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *