ఇది నేటి ప్రపంచం

ఎండిన డొక్కలు
మాడిన బ్రతుకులు
నిరాశా నిస్పృహలు నేస్తాలు
మారని జీవితాలు
వర్షించని మేఘం
కరుణించని పాడిపంటలు
రెక్కాడని రోజులు
పస్తులతో నిదురపోతూ
మంచినీళ్లు తాగుతూ…
కొంచెం ఎంగిలి దొరికితే బాగుండు అన్న ఆలోచనలు
పసి కడుపులు నింపొచ్చు అనే తాపత్రయం
కన్నం వేసే ఆలోచన ఒకవైపు
మనిషినని గుర్తు చేసుకుంటూ మరోవైపు…
హృదయం ఎప్పుడో భూమిలాగ నెర్రెలువారింది
సహాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తూ
ఆ నీలిమేఘం ఎప్పుడు నాలుగు చినుకులను రాలుస్తూ
ఆ చినుకులతోనైనా కడుపు నింపుకుంటాం
నీరు లేక పైరు లేదు
పైరు లేక గింజలు లేవు
గింజలు లేక మనుగడే లేదు
అయినా
పండని నేలకు విలువ లేదు
పండిరచే రైతుకు విలువ లేదు
ఇది నేటి ప్రపంచం…
ఆధునిక హంగులతో
ముందుకెళ్తూ మరచిన అసలు నిజం

ఆర్‌. నవజీవన్‌ రెడ్డి
ఫోన్‌ : 9742377332

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *