నిన్నటి నిశా సభలో…?
నిఖిల రత్నాన్ని చూశాను
నా హృదయ కడలిలో
దాచానో లేదో…!
ఉదయపు అరుణ
కాంతులలో మెరుస్తూ
నన్ను మైమరిపింప చేస్తూ
ఆమె ప్రతిబింబమే
నా జాడను తెలియజేస్తుంది.
గాఢమైన సుషుప్తి లో
నిగూఢంగా విహరిస్తూ
నా దిశను నలు దశలుగా
ప్రసరింప చేస్తు తన ఉనికికై
ఉబలాటపడుతున్నది
ఊహకే ఊపిరి పోసిన వయ్యారి
నా తలపున చేరి
కనుసైగా చేసి భవిష్యత్తుని
కవ్వింపజేస్తున్నది
ఉజ్వల మయంతో
సాగిన స్వప్నం లోని
కలలారాణి ప్రత్యక్షమై
కనికరించునో..!
జ్ఞాపకమైపోవునో.!
నేటి రోజుకై పరితపించాలి.
సాహిత్య మణి,
97041 18352