ప్రపంచమే ఉత్తమ గ్రంథం
కాలమే ఉత్తమ గురువు
ప్రకృతే పాఠ్య /విద్యా ప్రణాళిక
జ్ఞానం సూర్యుడిలా ప్రకాశించడానికి
అజ్ఞానం మేఘంలా విచ్చుకోవడానికి
వ్యక్తిత్వం సమగ్రంగా వికసించడానికి
సాటి మనిషి పట్ల సోదర భావం ప్రగాఢంగా అల్లుకోవడానికి
సంఘ జీవనం
మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లడానికి
‘‘సాధన, అభ్యాసం’’ ‘‘తపస్సులా’’ నిరంతరం సాగాలి..!
ఊపిరి పోసుకున్న దశ నుంచి ఊపిరి వదిలే వరకు
ప్రతి మనిషి నిత్య విద్యార్థి కావాలి నిరంతరం
‘‘అభ్యాసం’’ చేయాలి
శిల శిల్పంగా మారినట్లు ,మోడు పుష్పించినట్లు..!
మనిషి,మనీషిగా ‘‘పరివర్తన’’ చెందాలి..
ప్రకృతే విలువైన పాఠశాల..!
కొండలు, కోనలు,చెట్టూ , పుట్టా, నదీ నదాలు
అద్భుతమైన పాఠాలు..!
‘‘అధ్యయనమే అజ్ఞానాంధకారాన్ని తొలగించగలదు’’..!
అనంతమైన విశ్వ రహశ్యాల్ని తెలుసుకోవడానికి ఉపకరించేది
‘‘అభ్యసనమే’’..
నిన్ను నీవు దర్శించుకోవాలంటే..!
నువ్వొక జ్ఞానిలా మారాలంటే ‘‘అభ్యసనం’’ ఆవశ్యకం..!
కిరాతుడు వాల్మీకిగా, వేమన యోగిగా,
సిద్ధార్థుడు బుద్ధుడిగా, పరివర్తన చెందినట్లు..!
‘‘నిరంతరం అభ్యసించు’’…!
డాక్టర్ మహమ్మద్ హసన్
ఫోన్ : 990 805 9234