సవర ధ్వనిశాస్త్రం ఒక పరిశీలన

వ్యాస సంగ్రహం:

సవర భాష ఆస్ట్రో ఆషియాటిక్ కుటుంబానికి చెందిన ముండా కుటుంబలోని దక్షిణ ఉప కుటుంబానికి చెందినది. దీని వ్యవహర్తలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో ఉన్నారు. 19 శతాబ్దం ప్రారంభం నుండి దీనిపైన అనేక పరిశోధనలు జరిగినప్పటికి అవి ఎక్కువగా ఒరిస్సా రాష్ట్ర పరిధిలో జరిగాయి. మాతృభాషలో విద్యాబోధన కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సవరభాష పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాల్గొనడం జరిగింది. గిడుగు రామమూర్తి గారి సవర మాన్యూవల్ కి, ఈ శతాబ్దం లో జరిగిన సవర పరిశోధనల్లో సవర వర్ణాల్లో వ్యత్యాసం కనబడుతున్నది. ఈ విషయంపై ప్రస్తుత పత్రంలో వర్ణనాత్మక భాషాశాస్త్ర పద్ధతిలో వివరించడం జరిగింది. సవర భాషలో ఇరవై ఏడు వర్ణాలు ఉన్నాయి. అందులో తొమ్మిది అచ్చులు, పద్దెనిమిది హల్లులు. వర్ణనాత్మక భాషాశాస్త్ర పద్ధతిలో వీటి వ్యాప్తిని, భేదకత్వాన్ని వివరించడం జరిగింది.

కీలక పదాలు: సవర భాష, అచ్చులు, హల్లులు, వ్యాప్తి, వర్ణనాత్మక భాషాశాస్త్రం, ముండా కుటుంబం.

1        ఉపోద్ఘాతం

సవర భాష ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన సవర గిరిజనులకు చెందిన భాష. ఇది ఆస్ట్రో ఆషియాటిక్ కుటుంబానికి చెందిన ముండా కుటుంబలోని దక్షిణ ఉప కుటుంబానికి చెందినది. రామాయణం, మహాభారతంలో సవరల ప్రస్తావన మనకు కనబడుతుంది. సాహిత్య దర్పణంలో వీరి బాష, వృత్తి ప్రస్తావన చేయబడింది. బాణుడి హర్షచరిత్రలో రాజ్యశ్రీ ఉదంతంలో హర్షవర్ధనుడు సవర నాయకుడి సహకారం పొందినట్లు ఉన్నది. ఎస్. భట్టాచార్య 1975లో ముండా భాషల వర్గీకరణ, వాటి వైవిధ్యం మరియు వ్యాప్తి పట్ల మన అవగాహనను మరింత సుసంపన్నం చేసింది. అతను వివిధ భాషలతో పాటు దిగువ ముండా మరియు ఎగువ ముండా శాఖలుగా భాషలను క్రమబద్ధంగా సమూహపరచడం ముండా భాషా కుటుంబం యొక్క సమగ్ర వీక్షణను అందించింది. Zide యొక్క వర్గీకరణ ప్రారంభంలో భౌగోళిక పరిగణనల ఆధారంగా సవరను కోరాపుట్ ముండాలోని ఒక భాషగా వర్గీకరించింది. భాషా లక్షణాలను ప్రాథమిక అంశంగా అండర్సన్ చేసిన పునర్విభజన ప్రకారం సవర దక్షిణ ముండా వర్గానికి చెందినది అని నిరూపించబడింది పూర్వపరిశోధన
శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు రచించిన 1931 లో “ఏ మాన్యూవల్ ఆఫ్ సొర లాంగ్వేజ్”, 1933 లో “సవర-ఇంగ్షీషు నిఘంటువు” లు సవర ధ్వనులను, వ్యాకరణాన్ని సమగ్రంగా అందించాయి. గ్రియర్సన్ (1906) లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా లోని నాలుగవ భాగం ముండా మరియు ద్రావిడ భాషలు అనే సంపుటిలో సవర భాష గురించి తెలియచేశారు. పాఠశాల విద్యా శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 1 నుండి 5 తరగతుల వారికి మాతృభాషలో విద్యాబోధన పథకంలో తయారుచేసిన పాఠ్యపుస్తకాలలో సవర భాషకు కూడా తయారుచేయడం జరిగింది. శ్రీ అల్లంశెట్టి చంద్రశేఖర రావు గారు సవర వ్యాకరణం మీద పిహెచ్ డీ గ్రంథాన్ని సమర్పించారు.

శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు రచించిన 1931 లో “ఏ మాన్యూవల్ ఆఫ్ సొర లాంగ్వేజ్” లో 17 హల్లులు, 10 అచ్చులు పేర్కొన్నారు. కానీ 1933 లో ప్రచురించిన సవర-ఇంగ్షీషు నిఘంటువులో 18 హల్లులు, 9 అచ్చులు పేర్కొన్నారు. అలాగే David Stampe (1965) సవరలో 18 హల్లులు, 9 అచ్చులను పేర్కొన్నారు. పిహెచ్.డి సిద్దాంత గ్రంథం కోసం సేకరించిన సవర సమాచారంలో 9 అచ్చులు, 18 హల్లులను గుర్తించడం జరిగింది. వీటి గురించి ఈ పత్రంలో వివరించడం జరిగింది.
2. విషయ సేకరణ
సవర మాండలికాల తులనాత్మక పరిశోధన గ్రంథం కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని సవర ప్రాంతాల్లో విషయసేకరణ చేయడం జరిగింది. కేంద్రీయ భారతీయ భాషా సంస్థ (CIIL) వారు అంతరించి పోతున్న భాషల పరిరక్షణ కోసం రూపోందించిన ప్రశ్నావళిని ఉపయోగించడం జరిగింది. దాని ఆధారంగా సవరల ఆహార, శరీర, ఇంటి, వృత్తి, ప్రకృతి, జంతు, పక్షి సంబంధమైన పదజాలాన్ని విభాగాలవారిగా సేకరించాను. ముప్పై సంవత్సరాల పైబడిన స్త్రీ, పురుషుల నుండి సమాచారాన్ని సేకరించాను. సవర మాతృభాషగా కలిగిన వారితో పాటు, తెలుగు తెలిసిన వారిని కూడా వ్యవహర్తలుగా ఎంపిక చేసుకున్నాను. సమాచారాన్ని డిజిటల్ వాయిస్ రికార్డర్ లో నిక్షిప్తం చేస్తూ ఉచ్ఛారణ విధేయంగా అంతర్జాతీయ ధ్వని అక్షరమాల (IPA) రాసుకోవడం జరిగింది. సేకరించిన సమాచారాన్ని మళ్ళీ ఒకసారి క్షేత్రంలోనే సరిచూసుకోవడం జరిగింది. సవర భాషలోని వర్ణాలకు సమానమైన అన్ని వర్ణాలు తెలుగులో లేనందువల్ల సవర భాషా పదాలను IPA లో రాయడం జరిగింది.
3. సవర వర్ణాలు
సవర భాషలో ఇరవై ఏడు వర్ణాలు ఉన్నాయి. అందులో తొమ్మిది అచ్చులు, పద్దెనిమిది హల్లులు.
3.1 అచ్చులు
సవర భాషలో తొమ్మిది అచ్చులు ఉన్నాయి. ఇవి నాలుక ఎత్తును బట్టి సంవృత, ఆర్థ-సంవృత, ఆర్థ కేంద్ర, ఆర్థ-వివృత, వివృత అచ్చులుగాను, నాలుక స్థానాన్ని బట్టి పూర్వ, కేంద్ర, పశ్చిమ, ఆర్థ పూర్వ, ఆర్థ పశ్చిమ, కేంద్ర అచ్చులుగాను, పెదాల వ్యాప్తిని బట్టి ఓష్ఠ, నిరోష్ఠ్య అచ్చులుగాను వర్గీకరించవచ్చు. సవర అచ్చులలో హ్రస్వ, ధీర్ఘ భేదం లేదు.  ఈ భాషలో ధీర్ఘం వర్ణస్థాయిలో లేనప్పటికీ పదాంతంలో వచ్చే అచ్చులు సాధారణంగా ధీర్ఘత్వాన్ని పొందుతున్నాయి. ముండా భాషలలో ఉన్న అచ్చుల అనునాసికత్వం అనేది సవరలో ఉన్నప్పటికీ అది ధ్వని విధేయ దృగ్విషయంగా చెప్పవచ్చు. అనునాసిక హల్లు ముందు, తర్వాత, రెండింటి మధ్యలో వచ్చినప్పుడు అనునాసికత్వం కలుగుతున్నది. ఈ అనునాసికత భేదకత్వాన్ని కలిగించేది కాదు.

 పూర్వకేంద్రపశ్చిమ
సంవృతi    u
   ɨ ʊ 
ఆర్థ- సంవృత e   o
     ə  
ఆర్థ- వివృత     ɔ
       
వివృత      ɑ

అచ్చుల ఉచ్చారణా లక్షణాలను అచ్చుల స్థానం(పూర్వ , కేంద్ర, పశ్చిమ), ధీర్ఘత (హ్రస్వ, ధీర్ఘ), సందర్భం (అనునాసికత, దిత్వాక్షరాలు) , అక్షర నిర్మాణం (సంవృత, ఆర్థ-సంవృత, ఆర్థ కేంద్ర, ఆర్థ-వివృత, వివృత) తో పాటు పరస్పర సంబంధాలు (vowel harmony), పదాలలో వాటి ఉచ్ఛారణ ప్రభావితం చేస్తాయి[i].

3.1.1     అచ్చుల భేదయుగ్మాలు

/i/ vs /e/ లు పదాది, పదమధ్య,  పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/i/ vs /e/  పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
idగీకుɡid‘గోకు’bɑːdz̆i‘పిచ్చి ’
ed‘మొండియగు ’ɡed‘మెలి పెట్టుbɑd͜ze‘నిశ్శబ్దంగా ఉండు ’

/i/ vs /o /లు పదాది, పదమధ్య,  పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/i/ vs /o /పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
iɖeː‘అచ్చువేయు’ɡid‘గోకు’dz̆iʔiː‘పన్ను’
oɖeː‘ఒప్పుకోను ’ɡod‘పంజా’d͜zoʔo:‘పండు’

/i/ vs /u/ లు పదాది, పదమధ్య, పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/i/ vs /u/  పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
idగీకుɡid‘గోకు’ɲiː‘కొను’
ud‘దొర్లించు ’ɡud‘గిచ్చు’ɲuː‘వాసన ’

/i/ vs /ə/ లు పదాది, పదమధ్య కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

/i/ vs /ə/  పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
irɑː‘అనుకూలమైన’riɖiːn‘పొడి’  
ərɑː‘కర్ర’rəɖiːn‘ఇత్తడి’  

/i/vs /ɑ/ లు పదాది, పదమధ్య, పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/i/vs /ɑ/పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
id͜z‘నలుసు’tiŋ‘విందు’ɲiː‘కొను’
ɑd͜z‘కలుపు’tɑŋ‘మరణించు’ɲɑː‘నడుచు ’

/ɨ/vs/ɑ/లు పదాది, పదమధ్య, పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/ɨ/vs/ɑ/పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
ɨr‘వెళ్ళు’tiŋ‘విందు’ɲiː‘కొను’
ɑr‘రుద్దు’tɑŋ‘మరణించు’ɲɑː‘నడుచు ’

/u/vs/ʊ/ లు పదాది, పదమధ్య, పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

/u/vs/ʊ/పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
uʔuː‘వెంట్రుక’uruŋ‘తీసుకొనిపోవు’uʔuː‘వెంట్రుక’
ʊʔʊː‘అవును’urʊŋ‘వెదురు’ʊʔʊː‘అవును’

/i/vs/ɨ/ లు పదాది, పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

/i/vs/ɨ/పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
id‘గీకు’til‘పాతిపెట్టు’  
ɨd‘ఖండించు ’tɨl‘దొర్లు ’  

/o/vs/ɔ/ లు పదాది, పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

/o/vs/ɔ/పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
odi‘ధరించు’kob‘కూడబెట్టు’  
ɔdi‘కదుల్చు’kɔb‘బలి ఇచ్చు’  

3.1.2    అచ్చుల వ్యాప్తి

సవర భాషపదంలో అచ్చులు వచ్చే ప్రదేశం ప్రకారం ఈ కింది పట్టికలో ఇవ్వడం జరిగింది. మిగతా భాషల్లో వచ్చినట్లు సవర భాషలో అన్నీ అచ్చులు అన్నీ స్థానాల్లో రావడం లేదు. ఎనిమిది అచ్చుల్లో రెండు అచ్చులు/ ᵻ, ə/ పదాంతంలో రావడం లేదు. మిగతావన్ని అన్ని స్థానాల్లో వస్తున్నాయి


 
పదాదిపదమధ్యపదాంతం
అచ్చుసవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
iiʔiː‘పేను’ədil‘దుమ్ము’eŋɡsi‘ఉంగరం’
uuʔuː‘జుట్టు’ɡuldz̆i‘ఏడు’kullu‘నక్క’
eeɲd͜ʒum‘గొడ్డలి’bentɑ‘వేట’kɨnte‘అరటి’
ɔɔdi‘కదుల్చు’kɔb‘బలి ఇచ్చు’
oonti‘పక్షి’ɑdoŋ‘దూలం’əloː‘నది’
ɑɑʔɑː‘బాణం’tɑrbɑː‘పువ్వు’ɑbɑ‘ఇప్ప చెట్టు’
ɨbbɑː‘ముల్లు’tɨme‘అమ్ము’
ʊʊʔʊː‘అవును’bʊjɑː‘పూజారి’karʊː‘కోతి’
əəjoː‘చేప’ɡədin‘స్నేహితుడు’

3.2       హల్లులు

సవర భాషలో మొత్తం పద్దెనిమిది (18) హల్లుల ధ్వనులు ఉన్నాయి, అవి /p, b, t, d, k, ɡ, ʔ, m, n, ɲ, ŋ, r, ɽ, dʒ, s, ʋ, j మరియు l /. ఈ హల్లులు వాటి ఉచ్చారణ స్థలం ఆధారంగా వర్గీకరించబడ్డాయి. ఇందులో ఉభయోష్ఠ, కంఠ స్పర్శాలలో మాత్రమే శ్వాస, నాద భేదకత్వం కనబడుతుంది. దంత్య, దంతోష్ఠ్య, దంతమూలియ, తాలవ్యోత్తర, తాలవ్య, కంఠ, కంఠమూలీయ అనే ఏడు రకాల స్పర్శాలు ఉన్నాయి. కంఠ మూలీకృత స్పర్శం అనేది సవర భాషలో ఉన్న ప్రత్యక వర్ణం. తాలవ్య నాద స్పృష్టోష్మం (d͜ʒ) ఉన్నప్పటికీ తాలవ్య శ్వాస స్పృష్టోష్మం సవరలో కనబడడం లేదు. దంతమూలియ శ్వాస ఊష్మంకి సమానమైన దంతమూలియ నాద ఊష్మం లేదు. నాద స్పర్శాలు b, d , g లు పదాంతంలో ఆవిముక్త స్పర్శాలు (unreleased stops) గా కనబడుతున్నాయి. సాధారణ సంభాషణలో సవరేతరులు దీనిని వెంటనే గుర్తించడం సులువు కాదు. అవిముక్త పదానికి ఏదైనా ప్రత్యయం చేరినపుడు మాత్రమే ఈ ఆవిముక్త ధ్వని మనం తెలుసుకోగలం. ఈ లక్షణం నాద స్పర్శాలకు పదాంతంలో సవర్ణంగా వస్తుంది. దంత్య శ్వాస స్పర్శానికి (t) నాద ప్రతిరూపం, తాలవ్యోత్తర నాద స్పర్శానికి (d) శ్వాస ప్రతిరూపం లోపించాయి. ఈ లోపానికి కారణం కేవలం స్వేచ్ఛాప్రవృత్తిగానే కనబడతుంది. ఇతర ప్రత్యేక కారణాలు కనబడటం లేదు. ఇతర దక్షిణ-ముండా భాషాలలాగానే సవరలో మహాప్రాణ ధ్వనులు లేవు. ఇతర భాషల నుండి ఆదానం చేసుకున్న పదాలలో మహాప్రాణత్వం లోపిస్తుంది. ఉచ్చారణలో ప్రయత్న వ్యత్యాసం వల్ల స్పర్శ, అనునాసిక, తాలవ్య, కంపిత, కంఠ్య, ఊష్మ, అంతస్థ, స్పృష్టోష్మ, పార్శ్వ హల్లులు సవరలో ఉన్నాయి. సవరలోఉభయోష్ట (m), దంత్య (n), తాలవ్య (ɲ), కంఠ (ŋ) అనే నాలుగు అనునాసికాలు ఉన్నాయి. r అనే కంపితం, l అనే పార్శ్వం తో పాటు రెండు అంతస్థాలు ʋ, j లు కూడా ఉన్నాయి.

 ఉభయోష్టదంతోష్ఠ్యదంత్యదంతమూలియతాలవ్యోత్తరమూర్ధన్యతాలవ్యకంఠకంఠమూలీయ
 శ్వానాశ్వానాశ్వా  నాశ్వానాశ్వానాశ్వానా  
స్పర్శం p     b t      d  k       gʔ 
అనునాసికం      m n    ɲ        ŋ 
కంపితం   r     
తాడితం     ɽ   
స్పృష్టోష్మం            d͜ʒ  
ఊష్మం   s     
అంతస్థం         ʋ            j  
పార్శ్వం    l     

3.2.1    హల్లుల భేదయుగ్మాలు

3.2.1.1       p, b లు పదాది, పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
pub‘చెరుగు’kɑppɑːn‘రెక్క’  
bub‘ముంచు’kɑbbɑːn‘కడ్డీ’  

3.2.1.2       t, d లు పదాది, పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
be‘1 PL’obɑ‘appoint’  
ɖe‘become’oɖɑ‘stream’  

3.2.1.3       k, ɡ లు పదాది, పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాంతంలో భేదకత్వం లేదు.

పదాదిపదమధ్య 
సవరఅర్థంసవరఅర్థం  
ɡənuːr‘వాన’əkur‘తోలువూడు’  
kənuːr‘వెదురు’əɡur     ‘పండు’  

3.2.1.4       t, ʔ పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి. పదాది, పదాంతంలో భేదకత్వం లేదు.

 పదమధ్య 
  సవరఅర్థం  
  tɑːr‘చేదు పోగొట్టుకొనుట’  
  ʔːɑr‘మారు’  

3.2.1.5       m, n లు పదాది, పదమధ్య పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
mɑnɑ‘రమ్యమైన’mɑɖ‘మెత్తని’mకాటు’
nɑmɑ‘ఇది’nɑɖ‘ఒత్తిడి’n‘బిగువైన

3.2.1.6       m, ɲ లు పదాది, పదమధ్య పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
mɑnɑ‘రమ్యమైన’lɑmɑɖ‘మెత్తని’dɑm‘విశేషణ ప్రత్యయం ‘
ɲɑmɑ‘నడక’lɑɲeɖ‘దృఢమైన’ɖɑɲ‘నమలు’

3.2.1.7       m, ŋ లు పదమధ్య, పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

 పదమధ్యపదాంతం
  సవరఅర్థంసవరఅర్థం
  ɲɑmɑŋ‘దహనమగు’ɑɖəm‘దగ్గర’
  ɲɑŋɑ‘విల్లు’ɑɖəŋ‘తేనెతుట్టె’

3.2.1.8       /r/,/l/,

r, l లు పదాది, పదమధ్య పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
rɑŋ‘తెలియజెప్పుpurpur‘పూజ’tɑlmɑːɖ‘విచారించుట’
lɑŋ‘సందర్శనం’pulpul‘వెదజల్లు’tɑrmɑːɖ‘మెరుపు’

3.2.1.9       d͜z, r లు పదాది, పదమధ్య పదాంత భేదకత్వం కలిగి ఉన్నాయి.

పదాదిపదమధ్యపదాంతం
సవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
d͜zɑʔɑːɖ̚‘పాము’d͜zɑːd͜zɑː‘అప్పు’ɖud͜z‘వంగు’
rɑʔɑːɖ̚‘అడ్డాకు’d͜zɑːrɑː‘వెంటనే’dur‘పారిపోవు’

3.2.1.10    r, ɽ లు  పదమధ్య భేదకత్వం కలిగి ఉన్నాయి.

పదాదిపదమధ్యపదాంతం
  సవరఅర్థం  
  mɑːrɑ‘నెమలి’  
  mɑːɽɑ‘అటక ’  

3.2.2   హల్లుల వ్యాప్తి

ఈ కింది పట్టికలో సవర హల్లుల వ్యాప్తిని స్థానం వారీగా ఇవ్వడం జరిగింది.

 పదాదిపదమధ్యపదాంతం
హచ్చుసవరఅర్థంసవరఅర్థంసవరఅర్థం
pəluː‘తెలుపు’dɑpeː‘పొట్ట’
boŋtel‘దున్న’rɨbən‘నిన్న’ɑdub̚‘పాలు’
tʊləb̚‘అడవి’ətũŋ‘సొరకాయ’ 
dɑʔɑː‘నీరు’sindiː‘ఈత చెట్టు’bəsed̚‘ఉప్పు’
kɑke‘అక్క’kɑko‘అన్న’ 
ɡəre‘కాలేయం’bɑːɡu‘రెండు’
 ʔ ɑʔɑːn‘బాణం’
muʔuːn‘ముక్కు’rɑmeŋ‘పిల్లి’kɑnsim‘కోడి’
neʔeːb‘చెట్టు’kɨnɑː‘పులి’ʊɑːn‘తండ్రి’
ɲilim‘జలగ’diɲbɑ‘ఇప్ప చెట్టు’moroɲ‘నీటికుండ’
ŋoːrŋoːr[ii]‘మహాధ్వని’ɲɑŋɑవిల్లు’ɑlɑŋ‘నాలుక’
rediːn‘పొడి’buru‘పార’ɡənur‘వర్షం’
d͜zodɑ‘నది’ɡɔrd͜zɑːŋ‘గ్రామం’kɔrod͜z‘మినుములు’
siʔiːn‘చేయి’əsɔŋ‘పేడ’ 
jɑːɡi‘మూడు’əjoː‘చేప’ɡənɑj‘దుంప’
ʋɑːjeːle‘నులిమివేయు’ɑʋɑːŋ‘అత్త’ 
ləbo‘నేల’pəluː‘తెలుపు’’kɨmbul‘ఎలుక’

అన్ని నాద స్పర్శాలు పదాది, పదమధ్య స్థానాల్లోనే కనబడుతున్నాయి. పదాంతంలో రావడం లేదు. అన్ని శ్వాస స్పర్శాలు పదాది, పదమధ్య, పదాంతం స్థానాల్లోనే కనబడుతున్నాయి. పదాంతంలో ఇవి సవర్ణాలుగా వస్తున్నాయి. అన్నీ నాసికాలు పదాది, పదమధ్య, పదాంతం స్థానాల్లో కన్పిస్తున్నాయి. కానీ కంఠ అనునాసికం మాత్రం కేవలం కొన్ని భావస్పోరక పదాలలో మాత్రమే పదాదిలో వస్తున్నది.[iii] కంఠ మూలీకృత స్పర్శం కేవలం పదమధ్యలోనే వస్తున్నది. శ్వాస స్పర్శాల లాగానే దంతమూలియ ఊష్మం, దంతోష్ఠ్య అంతస్థాలు కూడా పదాదిలో రావడం లేదు.
4. ముగింపు
ఈ పత్రంలో సవర భాషలోని వర్ణాల గురించి వివరించడం జరిగింద. అచ్చులు, హల్లులు పదంలో ఎ స్థానంలో వస్తున్నాయో అనే విశేషణ చేయడం జరిగింది. ఈ వర్ణ సమామ్నయ విశ్లేషణ సవర భాషా పరిరక్షణకు దోహదపడుతుంది. ఇది యువతరాలకు భాషను బోధించడానికి ఉపయోగపడే విద్యా సామగ్రి, నిఘంటువులు మరియు భాషా వనరులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది వారి భాషాజ్ఞానాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం మరియు ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీనివల్ల భాష యొక్క చారిత్రక అభివృద్ధి, మాండలిక వైవిధ్యాలు మరియు ప్రత్యేక ధ్వని లక్షణాలను మరింత లోతుగా అన్వేషించ వీలవుతుంది. డిజిటల్ యుగంలో ఈభాషను అందరికీ అందుబాటులోకి తేవడానికి వాయిస్ గుర్తింపు వ్యవస్థలు, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీలు లేదా డిజిటల్ లాంగ్వేజ్ రిసోర్సెస్ వంటి ఆధునిక సాంకేతికతలతో అనుసంధానించడానికి ఇది అవసరమవుతుంది.

ఉపయుక్త గ్రంథావళి:

తెలుగు:

  1. మందలపు వి. రమణయ్య, & కర్నాటి తోమాసయ్య. (2005). తెలుగు భాష సిద్ధాంతం-అనువర్తనం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: హైదరాబాద్.

ఆంగ్లం:

  1. Chandrasekharrao, A. (2010). Savara Grammar: A Tagmemic Analysis. Ponduru: Adarsa Kala Mandiram.
  2. Ramamurti, G. V. (1931). A Manual of the So:ra (or Savara) Language. Madras: Government Press.
  3. Ramamurti, G. V. (1938). Sora – English Dictionary. New Delhi: Mittal.
  4. Ramamurti, G. V. (Telugu Savara Dictionary). Director of Public Instruction.
  5. Sankara Reddy, M. (1993). Savara Language Learning Book. Goyidi, Srikakulam: Janachetana.
  6. Sankara Reddy, M. et al. (1997). Savara Life Educative Book. Goyidi, Srikakulam: Janachetana.
  7. Tea Districts Labour Association. (1927). Language Handbook SAVARA. Calcutta.
  8. Vedantham Muralidhar & Dr. G. S Gabriel. 2011. Reduplication in Savara. In Osmania Papers in Linguistics, Volume 37, 2011. ISSN 0970-0277. Osmania University: Hyderabad.
  9. Vedantham Muralidhar.(2010). An acoustic study of Savara Nasals. In Osmania Papers in Linguistics, Volume 36, 2010. ISSN 0970-0277. Osmania University: Hyderabad.
  10. Vedantham Muralidhar. (2012). Sorang Sompeng: A Linguistics Analysis. In Osmania Papers in Linguistics, Volume 38, 2012. ISSN 0970-0277. Osmania University: Hyderabad.
  11. Vedantham Muralidhar. (2013). Personal Pronouns in Savara. In Osmania Papers in Linguistics, Volume 39, 2013. ISSN 0970-0277. Osmania University: Hyderabad.
  12. Vedantham Muralidhar. (2015). Savara. In Ushadevi. A and ChandraShekhara Reddy D (eds.) Languages of Andhra Pradesh and Telangana Vol.3 – Part I (In Telugu) 2015. pp 349-374. ISBN: 978-93-85231-05-6. Emesco Publication: Hyderabad.
  13. Venkatrao, T. (1981). Savarala Jiivana Sarali. Vijayawada: Visalandhra Publishing House.
  14. Stampe, D. L. (1965). Recent Works in Munda Linguistics I. International Journal of American Linguistics.,31(4), 332-341.

[i] కె. నాగమ్మారెడ్డి : ధ్వని శాస్త్రం–కొన్ని దృక్పథాలు పేజి. 163: తెలుగు భాష సిద్ధాంతం-అనువర్తనం.

[ii] రామమూర్తి సవర మాన్యూవల్ నుండి.

[iii] రామమూర్తి సవర మాన్యూవల్ నుండి

వేదాంతం మురళీధర్
పరిశోధక విద్యార్థి,
భాషాశాస్త్ర శాఖ,
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
చరవాణి: 9704068780

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *