గౌతముడా…
మనిషి దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసి
ధ్యానముద్రలోకి వెళ్ళిపోయావు
అమ్మ మీద ప్రేముండడం కూడా
కోరికెలా అవుతుంది చెప్పు?
గౌతముడా…
మనిషి దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసి
ధ్యానముద్రలోకి వెళ్ళిపోయావు
అమ్మ మీద ప్రేముండడం కూడా
కోరికెలా అవుతుంది చెప్పు? 1
సిద్ధార్థుడా….
నీవు మహారాజువు
నీవు ఏది చేసినా నడుస్తది
నీలాగ రాత్రికి రాత్రికి ఇల్లు విడిచిపోలేము
మేము సాధారణ మనుషులం
కన్నీళ్ళు తప్ప రక్తం ఉంటదని తెలువని వాళ్ళం 2
తండ్రీ …కళ్ళు తెరిచి చూడు
ఏడ గింజలున్నయంటే ఆడ వాలే పావురాలం మేము
వేటగాడి వలల సంగతి మాకు తెల్వదు
ఆశ కొట్లాడుతనే ఉంటది
ఎంతసేపు దమ్మపదాలలోంచే జీవితాన్ని నిర్వచిస్తావా ?
ఒకసారి కన్నీటిలోంచి బతుకును వ్యాఖ్యానించు. 3
బుద్ధుడా…
ఎంత సేపని కళ్ళు మూసుకుంటావు ?
ఒకసారి చేతులు చాచు…
నీ చేతుల్లో తలవెట్టుకోవాలని అనిపిస్తుంది 4
తగుళ్ళ గోపాల్
ఫోన్ : 9505056316