ఆచార్య సాగి కమలాకర శర్మ
మూసీ పత్రిక సంపాదకులు,
అధ్యక్షులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
కవి, రచయిత, విమర్శకులు.
తెలుగు బడిపంతులుగా పనిచేసిన జానకిరామయ్య, స్వరాజ్యలక్ష్మమ్మ కుమారుడు. తండ్రిదగ్గరే మౌలికమైన శాస్త్రాంశాలు, వ్యాకరణం, భాషా విషయాలు నేర్చుకున్నారు. డిగ్రీవరకు సైన్స్చదువుకుని తెలుగుపై గల మమకారంతో అందులో ఎం.ఏ, పిహెచ్.డి.లు పూర్తిచేసారు.
సంస్కృతం, ఆంగ్లం, జ్యోతిషం, యోగా, తత్త్వశాస్త్రాలలో కూడా ఎం.ఏ. పూర్తిచేయడంతో పాటు, కావల్సినంత జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. జ్యోతిషంపై గల అపారమైన జిజ్ఞాసతో లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసినవారు. తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష విభాగంలో పది సంవత్సరాలు పాఠ్యాంశాల రచయితగా, అధ్యాపకునిగా పనిచేసారు. 2007 ఉస్మానియా విశ్విద్యాలయంలో తెలుగు సహాయాచార్యునిగా ఉద్యోగం సాధించిననాటినుండి ఇప్పటి వరకు వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ ప్రస్తుతం శాఖ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. జానపదుల జ్యోతిర్విజ్ఞానం, జ్యోతిర్మయం వాజ్ఞయం, దానం – విధానం, కమలాకరం, శ్రీకరం వంటి గ్రంథాలు 12కు పైగా రచించారు. కదంబం, ఆలోకనం వంటి పదుల పుస్తకాలకు సంపాదకునిగా బాధ్యతవహించారు. వివిధ పత్రికలలో 300లకు పైగా వ్యాసాలు, వందకు పైగా పత్రసమర్పణలు, వివిధ టివి ఛానల్స్
లలో ఉపన్యాసాలు చేసిన నిత్యపరిశోధకులు. ‘రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత పురస్కారు మొదలైనవి పదికిపైగా వీరిని వరించాయి. ఆంధ్రభాషా భూషణ, జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద, జ్యోతిష మనీషి వంటి బిరుదులతో సత్కరించబడ్డారు. వీరి పర్యవేక్షణలో ఇప్పటి వరకు 14 మంది పిహెచ్.డి. పట్టా పొందారు. మరికొందరు చేస్తున్నారు. మూసీ సాహిత్య ధార, జ్యోతిర్వాణి, వేద సంస్కృతి పరిషత్ వంటి సంస్థలను స్థాపించి నేటి సమాజానికి సాహిత్యాన్ని, సంస్కృతిని, అధ్యాత్మికతను అందిస్తున్న నిత్య కృషీవలుడు. అన్నిటిని మించి శిష్యరికం చేయాలనించే గురుత్వం, స్నేహం చేయాలనిపించే వ్యక్తిత్వం, పలకరించాలని పించే మందహాసం ఎందరినో ఆకట్టుకుంటాయి.
డా. అట్టెం దత్తయ్య
మూసీ పత్రిక సహ సంపాదకులు,
సహాయ ఆచార్యులు,
శ్రీ వేంకటేశ్వర కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ,
కవి, రచయిత, విమర్శకులు.
తల్లిదండ్రులు లక్ష్మీ, మల్లయ్య.
పుట్టిన ప్రాంతం శట్పల్లి గ్రామం, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా.
‘కళ్లం’ (సాహిత్య వ్యాసరాశి)’
‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’
‘పట్నమొచ్చన – పల్లె భాషాపరిశీలన’
‘మహాభారతంలో –సంవాదాలు సమగ్రపరిశీలన’ గ్రంథాల రచయిత.
‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం),
‘శిలాక్షరం’ (బి.ఎన్. శాస్త్రి సాహిత్యం – సమాలోచన),
‘సారాంశం’ – 1 (పరిశోధన గ్రంథాలు – పరిచయం వ్యాసాలు),
‘సారాంశం’ – 2 (పరిశోధన గ్రంథాలు – పరిచయం వ్యాసాలు),
‘కమలాకరం’ (మూసీ సంపాదకీయాలు),
‘తెలుగు సామెతలు – సమగ్ర సమాలోచన’
‘కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం’ అనే గ్రంథాలకు సంపాదకులుగా, సహసంపాదకులుగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ప్రచురించిన ‘తెలంగాణ సాహిత్యం – సమాలోచనం’ (పరిశోధక విద్యార్థుల సాహిత్యవ్యాసాలు), ‘శతవాసంతిక’ (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక) ‘ఆలోకనం’ (తెలంగాణ 31 జిల్లాల సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలు) అనే గ్రంథాలకు సహాయ సంపాదకులుగా ఉన్నారు. భూపాల్
‘పట్నమొచ్చిన పల్లె – భాష పరిశీలన’ అనే అంశంపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. పట్టాపొందారు. ‘మహాభారతంలో సంవాదాలు – సమగ్రపరిశీలన’ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. పట్టాపొందారు. వివిధ పత్రికలలో 100కుపైగా వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 40వరకు పత్రసమర్పణలు చేసారు. ‘మూసీ సాహిత్య ధార’ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతవహిస్తున్నారు.