రచయితలకు సూచనలు

మూసీ ‘వ్యాస’ రచయితలకు సూచనలు

మీ వ్యాసాన్ని వర్డ్‌ (యునికోడ్‌), పేజిమేకర్‌ (అను.7)లో టైప్‌ చేసి editormusi@gmail.com కు మెయిల్‌ చేయగలరు.

 1. వ్యాససంగ్రహం: వ్యాససంగ్రహం – (Abstract) (200 పదాలకు మించకుండా) 1) రెండు-మూడు వాక్యాల పరిచయం, 2) వ్యాసరచన ముఖ్యోద్దేశం, 3) పరిశోధన ఊహా ప్రణాళిక, 4) అనుసరించిన పరిశోధన పద్ధతులు, 5) ఆశించే ఫలితాలతో కూడిన ముగింపు వుండాలి.
 2. Keywords: (కనీసం 5 పదాలు) (ఉదా: భాష, సాహిత్యం, ప్రకియలు, శతకం, నీతులు, విశ్లేషణ, అనువాదం, కవిపేరు, పాత్రచిత్రణ.) పూర్తి పరిశోధనవ్యాసం (పేజిమేకర్‌ ఎ4 సైజ్‌ లో 4-5 పేజీలకు తగ్గకుండా) వుండాలి.
 3. ఉపోద్ఘాతం: ఒకటి లేదా రెండు పేరాలలో పరిశోధన వ్యాస ముఖ్య ఉద్దేశాన్ని ఉపోద్ఘాతంగా పేర్కొనాలి. కవి/రచయిత పరిచయం, పరిశోధనాంశానికి సంబంధించిన పరిచయవాక్యాలను వ్రాయవచ్చును. పూర్వపరిశోధనలకు సంబంధించిన అంశాలను సంక్షిప్తంగా చర్చించవచ్చును.
 4. విషయం: పరిశోధనవిలువలుండాలి. సొంతంగా రాసినదై ఉండాలి. యధాతథంగా పుస్తకాలు, ఇంటర్నెట్‌ నుండి గ్రహించకూడదు. కొన్ని విభాగాలుగా విభజించుకుని, ఆయా విభాగాలకు అనుగుణమైన ఉపశీర్షికలు (సైడ్‌ హెడ్డింగ్స్‌) పొందుపరచాలి. ఎంచుకున్న పరిశోధన సామగ్రి (పుస్తకాల) నుండి పద్యం, కవిత, గేయం, కీర్తన, కథ, నవల, నాటకభాగాలు మొదలైన ఉల్లేఖాలను (references) అనుకరణ చిహ్నాల (‘‘ ’’) తో తప్పక ఉటంకించాలి. ఈ ఉటంకింపుల ప్రక్కనే బ్రాకెట్లో తప్పకుండా వాటికి తగిన సూచికలను సంక్షిప్తాక్షరాలలో పొందుపరచాలి. (ఉదా. ఆం.మ. భార. ఆది, ఆశ్వా. 5ప. 235) పేర్కొన్న ప్రతి పద్యం, కవిత, గేయ, వచన భాగాలను చక్కగా, పరిశోధన ధ్యేయం దృష్ట్యా విశ్లేషించాలి.
 5. ముగింపు: పరిశోధనలో వెలువడిన ఫలితాలను విశ్లేషణాత్మకంగా ‘ముగింపు’ అన్న శీర్షిక క్రింద పేర్కొనాలి. కవి ఆత్మీయత, శైలి, ఆకర్షణీయాంశాలు, వెలువడిన క్రొత్త విషయాలు, రచన సామాజిక ప్రయోజనం, భాషాసాహిత్యాలకు పరిపుష్టిని చేకూర్చే కావ్య, వ్యాకరణ, అలంకారాది అంశాలు, ప్రత్యేకతలు మొదలైనవి రెండు-మూడు పేరాలుగా ముగింపులో పేర్కొనవచ్చు.
 6. ఉపయుక్తగ్రంథసూచి: ముగింపు తరువాత ఆధారగ్రంథాలన్నింటికీ ఉపయుక్తగ్రంథసూచిని తప్పక పొందుపరచాలి. (రచయితపేరు, ఇంటిపేరు. ప్రచురణ సంవత్సరం). గ్రంథం పేరు, ప్రచురణసంస్థ, ప్రచురణ స్థలం.) సంకలనగ్రంథాలకు సంపాదకుడి పేరు పేర్కొనాలి. పత్రికావ్యాసాలు, బ్లాగ్‌, వెబ్సైట్లకు పూర్తివివరాలు తెలపాలి.

  ఉదా:
  1. కమలాకర శర్మ, సాగి. సంపా. ‘కదంబం’ (తెలుగు సాహిత్య ప్రక్రియలు – రూపాలు). 2014. హైదరాబాద్‌ : మూసీ ప్రచురణలు.

  2. రఘునాథ శర్మ, శలాక. ‘భారత ధ్వని దర్శనము’. 2000. అనంతపురం : ఆనందవల్లీ గ్రంథమాల.

  (సూచనలు పాటించని / పరిశోధనవిలువలు లేని/ పుస్తకాలు, ఇంటర్నెట్‌ నుండి యధాతథంగా రాసే వ్యాసాలు తిరస్కరించబడుతాయి)

గమనిక: వ్యాస ముద్రణకు ఎటువంటి రుసుము లేదు. వీలైతే చందాదారు కాగలరు.
మీ మిత్రులను కూడా చందా దారులను చేయండి.