శ్రీ . బి .ఎన్ . శాస్త్రి

మూసీ సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక తెలుగు మాస పత్రిక

సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు స్వర్గీయ బి.యన్ . శాస్త్రి గారు స్థాపించిన సాహితీ జీవధార ' మూసీ ' పత్రిక . తెలుగువారి వారసత్వపు జీవనవేడిగా సాహిత్య , సాంస్కృతిక చారిత్రక అంశాలకు పెద్దపీట వేసి దీనిని 1980 లో ప్రారంభించారు . ఒక్కమాటలో చెప్పాలంటే అతితక్కువ కాలంలోనే ఇది ' భారతి ' వంటి పత్రికలను మరిపించింది . మూసీ వేదికగా తెలుగువారి సాహిత్య సాంస్కృతిక చరిత్రలో సువర్ణాధ్యాయంగా పేర్కొనదగిన ఎన్నో నూతన పరిశోధనాత్మక వ్యాసాలు జీవం పోసుకుంటున్నాయి . ఇప్పటికీ నేటి పిల్ల పరిశోధకుల నుంచి పండితపరిశోధకుల దాకా నిరంతరం చైతన్యపు జీవధాతువుల్ని మూసీపత్రిక అందిస్తూనే ఉంది